సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోలలో ఒకరిగా మహేష్ బాబు నిలిచారు. ఇక ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
![ప్రిన్స్ మహేష్ బాబు ఇంట మరో విషాదం ! 2 ప్రిన్స్ మహేష్ బాబు ఇంట మరో విషాదం !](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-17T173031.014.jpg)
ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి . మహేష్ బాబు ఇంటిని కుదిపేస్తున్న సంగతి మనకి తెలిసిందే. మొదట మహేష్ బాబు తల్లి ఇందిరా మరణించగా ఆ…… తరువాత సూపర్ స్టార్ కృష్ణ కూడా అనారోగ్యంతో మృతి చెందారు. అయితే తాజాగా మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది . మహేష్ బాబు కూతురు సితార ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క మరణించింది.
ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు కూతురు సితార పాప కూడా వెల్లడించింది.మేమందరం నిన్ను చాలా మిస్ అవుతున్నాం… గత ఏడు సంవత్సరాలుగా మాతో ఉన్నావు నువ్వే నాకు చాలా బెస్ట్ అంటూ తన పోస్టుకు సితార పాప కూడా క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ పై నెంబర్ అంతా కూడా తన స్టైల్లో లోనే రిప్లై ఇచ్చింది. ఆ కుక్క ఎప్పుడు మన గుండెల్లో అలాగే ప్రార్థన లో ఉంటుంది అంటూ సితార పాపను ఓదార్చ ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటుంది.