Anupama Parameswaran: ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు త్రివిక్రమ్ అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ వస్తుంది.
వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీగా శతమానం భవతి సినిమా తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో కెరియర్ పరంగా కొంత వెనుకబడింది. అయితే మాతృభాషలో మాత్రం అవకాశాలు పుష్కలంగా అందుకుంటూ వచ్చింది.
తేజ్ ఐ లవ్ యు సినిమా తర్వాత భాగా స్లిమ్ అయిన ఈ బ్యూటీ మరల రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నటించింది. ఆ సినిమా సక్సెస్ అయిన ఆమెకి పేరు రాలేదు. ఇక రౌడీ బాయ్స్ సినిమాతో అనుపమ పాప పూర్తిగా మారిపోయి ఇంటిమేట్, కిస్సింగ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది.
అంత వరకు హోమ్లీగా నటించిన అమ్మడు ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా తన ఫేమ్ ని మార్చేసుకుంది. గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ కాస్తా స్పీడ్ పెంచింది. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసి రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు చీర కట్టులో స్లీవ్ లెస్ జాకెట్ వేసి బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. తాపంతో ఒళ్ళు విరుచుకుంటూ నడుము అందాలు చూపించింది.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత అనుపమ అందానికి కుర్రాళ్ళు ఫిదా అయిపోతూ ఉన్నారు. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే తట్టుకోవడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.