AP Politics: గతం వారం రోజులుగా సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామజోగయ్య, మంత్రి అమర్ నాథ్ మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అమర్ నాథ్ రెగ్యులర్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ టీడీపీ సీనియర్ కార్యకర్త అంటూ మంత్రి అమర్ నాథ్ ఆ మధ్య వ్యాఖ్యలు చేశారు. దీనిపై హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేశారు. తరువాత అమర్నాథ్ కూడా కౌంటర్ గా మరో లేఖ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ రిలీజ్ చేశారు. ఈ లేఖల పరంపర వారి మధ్య కొనసాగుతుంది. ఇదిలా ఉంటే అనకాపల్లిలో మంత్రి అమర్ నాథ్ 600 ఎకరాల భూమిని కబ్జా చేసారంటూ జనసేన నాయకులు విమర్శలు చేశారు.

అయితే దీనిపై అమర్ నాథ్ కూడా కౌంటర్ ఇచ్చి, తాను ఆక్రమించుకున్నట్లు ప్రూవ్ చేస్తే అవన్నీ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి రాసి ఇచ్చేస్తా అంటూ చాలెంజ్ చేశారు. అలాగే తాను అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవి నుంచి తప్పుకుంటా అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు. అయితే ఈ చాలెంజ్ ని జనసైనికులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అమర్ నాథ్ విస్సన్నపేటలో తన బినామీల పేరిట భూములు రాయించుకున్నారు అంటూ నిరూపించేందుకు చలో విస్సన్న పేటకి పిలుపునిచ్చారు.
జనసైనికులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వైసీపీ, జనసేన మధ్య ఈ గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఇక పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి జనసైనికులని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే అమర్నాథ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని, మీ భూకుంభకోణాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాము అంటూ జనసైనికులు ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఈ వైరం ఇద్దరి మధ్య ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ కావడంతో జనసైనికులు ఎక్కడా తగ్గకుండా వైసీపీ నాయకులకి దీటుగా సమాధానాలు చెబుతున్నారు.