Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అసలైన ఆట ఇప్పుడు కొనసాగుతోంది. ఇంత వరకు అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చారు. కానీ బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఎవరు ఏంటి అనేది బయటపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అసలు సిసలైన బిగ్ బాస్ గేమ్ లు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా స్నేహంగా ఉన్న హౌస్ సభ్యులు అందరూ గొడవ పడి వారి మనసులో మాటలను బయటపెట్టాల్సి వస్తోంది. బిగ్ బాస్ అలాంటి పరిస్థిని క్రియేట్ చేయడంతో తోపు అనే చెప్పవచ్చు.
ఈ క్రమంలో మొదటి వారం నుండి మిత్రులు గా కొనసాగిన రేవంత్, అర్జున్ బిగ్ బాస్ దెబ్బకు శత్రువులుగా మారాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రతిసారి గొడవలు ఎందుకులే అని కాంప్రమైజ్ అయ్యేవారు. కానీ ఎవరూ వినోదం అందించడం లేదని బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా గేములు, టాస్కుల విషయంలో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు.
ఈ క్రమంలో అర్జున్, రేవంత్ ల మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి. మొదటి నుండి అర్జున్ ని రేవంత్ కాస్త చిన్న చూపుతో చూస్తూ వస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఏ విషయంలోనూ అర్జున్ క్లారిటీగా ఉండలేడు అనేది రేవంత్ అభిప్రాయం. ఈ విషయం ఎన్నో సార్లు నేరుగానే అర్జున్ కి చెప్తాడు రేవంత్. నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను నీ మాదిరిగా కాదురా అని అర్జున్ కూడా రేవంత్ తో వాదిస్తూ ఉంటాడు.
గురువారం ఎపిసోడ్ లో జైలులో ఉన్న వాసంతితో రేవంత్ గురించి కొన్ని నిజాలు బయటపెడతాడు అర్జున్. రేవంత్ చాలా కన్నింగ్ ఫెలో… ఎవరు టాప్ 5 అని అనుకుంటాడో వారితో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఏదైనా గొడవలు పడినా సరే తానే స్వయంగా వెళ్లి మాట్లాడతాడు అని అర్జున్ చెప్తాడు. నేనంటే వాడికి తక్కువ చూపు అని తన మనసులో ఉన్న మాటలను వాసంతికి చెప్పుకుంటాడు అర్జున్. శ్రీసత్య ఇచ్చిన దెబ్బకు అర్జున్ కి విషయం ఏంటనేది బహుశా ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లుంది..!