జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ కి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో భారీ కాన్వాయ్ పై హాలీవుడ్ లో తెరకెక్కిన అవతార్ 2 మూవీపై ప్రపంచ వ్యాప్తంగాభారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాపై ఆరు నెలల నుంచి హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఏకంగా 126 భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయడంతో పాటు త్రీడీలో సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులని వినోదం అందించడానికి అవతార్ 2 మూవీ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందే టెలిగ్రామ్ యాప్ లో ప్రత్యక్షం అయ్యింది. అయితే మూవీ లీక్ అయిన సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి విజువల్ వండర్ ని సిల్వర్ స్క్రీన్ మీద అది కూడా త్రీడీలోనే చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారు.
ఇక సినిమా కంటెంట్ పరంగా చూసుకుంటే రెగ్యులర్ గా రెండు వర్గాల మధ్య నడిచే ఆధిపత్య పోరు. ఆ పోరులో శత్రువుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కథానాయకుడు సొంతవాళ్ళని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం. అక్కడి వారు అతన్ని ఆదరించడం. అయితే శత్రువులు కథానాయకుడిని వెతుక్కుంటూ అక్కడికి కూడా చేరుకోవడం. ఈ క్రమంలో శత్రువులని నుంచి తన కుటుంబంతో పాటు తనకి ఆశ్రయం ఇచ్చిన మిగిలిన వారికి ఎలాంటి నష్టం జరగకూడదని పోరాటం చేసి విజయం సాధించడం. మామూలుగా చూసుకుంటే ఎలాంటి ఎలిమెంట్ ఉన్న కథని ఇప్పటికే ఇండియన్ సినిమాలలో చాలా సార్లు చూసేసాం. ఓ విధంగా చెప్పాలంటే ఈ కమర్షియల్ ఫార్ములాతో మన దర్శకులు వందలాది సినిమాలు తీసారు. అయితే అవతార్ లాంటి అడ్వంచర్ సినిమాకి కథ కంటే ఆ కథలో విజువల్ ఎఫెక్ట్స్, అంతకు మించి ప్రేక్షకులకి థ్రిల్ చేసే అంశాలు, అలాగే వావ్ అనిపించే దృశ్యాలు మాత్రమే చూడటానికి వెళ్తారు.
అలాగే అవతార్ సినిమా చూసిన తర్వాత కామన్ ఆడియన్స్ జేమ్స్ కామెరూన్ నుంచి అలాంటి మరో విజువల్ వండర్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు తప్ప స్టొరీ ఎలా ఉందనేది అస్సలు పట్టించుకోడు. ఈ విషయం తెలుసు కాబట్టి జేమ్స్ ఆడియన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ప్యాక్ ని అవతార్ 2 తో అందించాడు. సినిమా ఆరంభం నుంచి ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటూ, థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. కథతో పాటు తెలియకుండానే ట్రావెల్ అయిపోతాడు. అయితే సినిమా నిడివి కారణంగా కొద్దిగా సాగదీసినట్లు ఉన్న చివరి 30 నిమిషాలు మాత్రం ఆడియన్స్ అడుగడుగునా ఎంజాయ్ చేస్తాడు.
విజువల్స్ కి తగ్గట్లుగానే పండోరా గ్రహం అందాలు. అలాగే సముద్రం, ఆకాశంలో జరిగే పోరాటాలు అడుగడునా ఆకట్టుకుంటాయి. ఓ వైపు టెక్నాలజీకి సంబంధించి విమానాలు, కొత్త కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు పాటు ప్రకృతిలో మమేకం అయిన జీవులు తమ ఉనికి కాపాడుకోవడానికి చేసే పోరాటాలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉన్నాయని చెప్పాలి. త్రీడీలో చూడటంతో ఇంకా ఎక్కువ థ్రిల్ కి ఆడియన్ ఫీల్ అవుతాడు. ఇక ఇండియాలో కూడా అవతార్ 2 మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టడం పక్కా అనే మాట వినిపిస్తుంది.