రానున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అని, తాము పవర్ లోకి రాగానే హోం మంత్రి పదవి తీసుకొని దారి తప్పినా లా అండ్ ఆర్డర్ ని గాడిలో పెడతానని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ నేతల అండ చూసుకొని రెచ్చిపోతున్న పోలీసులని బట్టలు ఊడదీసి పంపుతామని అన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ తన కంట్రోల్ ఉంటే కచ్చితంగా దారితప్పిన పోలీసులకి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తానని చెప్పారు. ఏ ఒక్కరిని వదిలి పెట్టె ప్రసక్తే లేదని హెచ్చరించారు. అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నానని అయ్యన్న పాత్రుడు పరుష పదజాలంతో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న మదంతో రెచ్చిపోతున్న దౌర్భాగ్యులు అందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అని అన్నారు.
ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారడంతో పాటు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిందనే మాట వినిపిస్తుంది. అధికార వైసీపీ టీడీపీ పార్టీని అణచివేయడానికి అన్ని రకాల కుట్రలు చేస్తుందనే భావన ఆ పార్టీలో ఉంది. వారి దాడులని, కుట్రలని బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా పాదయాత్ర ద్వారా చేయడానికి రెడీ అవుతున్నారు. ఎలాంటి సమయంలో టీడీపీని ఎలా కంట్రోల్ చేయాలా అనే ఆలోచనలో జగన్ రెడ్డి టీమ్ ఉంది.
అయితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉపయోగించుకుంటుంది. పోలీసులని చంపేస్తాం అని బెదిరిస్తున్నారని, హింసాత్మక ఆలోచనతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఇలాంటి వారు అధికారంలోకి వస్తే ప్రజల ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంటుందంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు ఎలా సమర్ధించాలి. అవి ప్రజలకి చేరువ కాకుండా ఏం చేయాలా అనే ఆలోచనలో చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.