ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా మేనియానే. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై కామెంట్స్ మామూలుగా లేవు. అటు మౌత్ టాక్.. ఇటు బారి కలెక్షన్లతో బేబీ సినిమా మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది . అదేంటంటే..?
బేబీ సినిమాపై మరో బజ్ క్రియేట్ అయ్యింది. సుమారు 3 గంటల నిడివి కలిగిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం 4 గంటల రన్టైమ్తో రానుందట. అయితే తాజాగా మరో పాట సహా.. కొన్ని సన్నివేశాలను సినిమాలో చేర్చనున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య,నటుడు విరాజ్ మధ్య ఎక్కువ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంటున్నారు అయితే ఇవన్నీ సాధ్యమైతే ఓటీటీలోకి ‘బేబీ’ నాలుగు గంటల రన్టైమ్తో సందడి చేయనుందట. అయితే ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది.. ఎప్పుడు వస్తుందో మాత్రం ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు.