OTTలోకి ‘బేబీ’ మూవీ
ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ సినిమా నే వినిపిస్తుంది . ఇక అదిఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై కమెంట్స్ మామూలుగా లేవు. అటు మౌత్ టాక్.. ఇటు కలెక్షన్లతో బేబీ సినిమా కి మంచి హిట్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ మొత్తం సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తోంది. డైరెక్టర్ సాయి రాజేష్ ఒక చిన్న కథను తీసుకుని చాలా సులభమైన విధానంలో “బేబీ” అనే సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చాడు .
![ఈనెల 25న OTTలోకి ‘బేబీ’ మూవీ..ఎందులో స్ట్రీమింగ్ అంటే ? 2 ఈనెల 25న OTTలోకి ‘బేబీ’ మూవీ..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-18T113052.642.jpg)
సాయి రాజేష్ సమకూర్చిన పాత్రలలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి లు చాలా చక్కగా నటించి మెప్పించారు. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘బేబీ’ స్ట్రీమింగ్ అవబోతుంది . ఈ నెల 25వ తేదీల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది