బేబి’ సినిమాను ఓ సాధారణమైన ప్రేమకథగానే ప్రేక్షకులు భావించారు. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ఈ ముగ్గురూ ప్రధానమైన పాత్రలను పోషించారు. అయితే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే క్రేజ్ ఈ ముగ్గురికీ ఇంకా రాలేదు. ఇక దర్శకుడు సాయి రాజేశ్ విషయానికి వస్తే, ఆయన ఎక్కువగా కామెడీ సినిమాలు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటివి చేస్తూ వచ్చారు . అందువలన ఈ సినిమాపై ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు. అలాంటి ఈ సినిమా చాలా ఫాస్టుగా యువత కి కనెక్ట్ అయ్యింది .
!['మెగా ఈవెంట్'కి సిద్దమైన 'బేబి' టీమ్! 2 'మెగా ఈవెంట్'కి సిద్దమైన 'బేబి' టీమ్!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-29T153632.165.jpg)
విడుదల వారం తిరక్కముందే 50 కోట్ల ను సాధించిన ఈ సినిమా, ఇప్పుడు 100 కోట్లకి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శక ,నిర్మాతలను మెగాస్టార్ అభినందించారు. బేబీ సినిమా ఘన విజయం సాధిచడంతో దర్శకుడు సాయిరాజేశ్ తాము మెగా ఈవెంట్ కి రెడీ అవుతున్నట్టు ,ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్న నేపథ్యంలో మెగా ఈవెంట్ ఒక ట్వీట్ చేశాడు. త్వరలోనే ఈవెంటును గురించిన అధికారంగా ప్రకటన రావొచ్చు.