Movie News: బాలయ్య అభిమానులకు మరో కిక్కులాంటి వార్త అందింది. అఖండ సినిమాతో కరోనా మహమ్మారి విపత్తు తర్వాత ఇండస్ట్రీ హిట్టు కొట్టిన బాలయ్య తర్వాత నటిస్తున్న తాజా చిత్రం NBK 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలయ్యని మాస్ లుక్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, బాలకృష్ణ లుక్స్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్ర టైటిల్ పై చాలా రోజులుగా సస్పెస్ కొనసాగుతూనే వచ్చింది. ఫ్యాన్స్ నిరీక్షణకి తెరదించుతూ నేడు టైటిల్ ప్రకటన చేసింది. టైటిల్ లాంచ్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర చిన్న ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, రచయిత సాయి మాధవ్, నిర్మాత రవి తదితరులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే టైటిల్ ప్రకటించడం జరిగింది. బాలకృష్ణ సింహా సెంటిమెంట్ కొనసాగిస్తూ ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు.
![Movie News: సంక్రాంతికి "వీరసింహారెడ్డి"గా వస్తున్న బాలయ్య..?! 2 veerasimha reddy](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/veerasimha-reddy.jpg)
బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి చిత్రాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ టైటిల్ కనిపిస్తోంది. నిర్మాత రవిశంకర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉండాలనే ఈ చిత్రానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఆయన కర్నూలులో జరిగిన ఈవెంట్ లో తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. బాలయ్య అభిమాని సినిమా చేస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది ఈ చిత్రం అని అన్నారు. సమరసింహారెడ్డిని మించి ఘన విజయం సాధిస్తుందని, ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలిపారు. అతి త్వరలోనే షూటింగ్ పూర్తి అవుతుందని, సంక్రాంతికి ఈ సినమా రానున్నందని తెలియజేశారు. మరి సింహా సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా బంఫర్ హిట్ అవ్వాలని కోరుకుందాం..!