బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకి వచ్చేసింది. ఇక ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే ఆరో సీజన్ కి ప్రేక్షకాదరణ అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పాలి. ఆరంభంలో అయితే హౌస్ లో కంటిస్టెంట్ లు ఎలాంటి జోష్ లేకుండా మూడు వారాల పాటు గడిపేశారు. అలాగే గేమ్స్ లో పార్టిసిపేషన్ ఉండేది కాదు. అయితే హోస్ట్ నాగార్జున సీరియస్ అయిన తర్వాత అందరూ తమ ఆటతీరుని మెరుగుపరుచుకున్నారు. తరువాత నుంచి మెల్లగా ప్రేక్షకాదరణ పెరిగింది. హౌస్ లో కంటిస్టెంట్ ల మీద కూడా బయట బిగ్ బాస్ ప్రేక్షకులకి ఒక ఒపీనియన్ వచ్చింది. దీంతో తమకి ఇష్టమైన కంటిస్టెంట్ లకి ఓటు వేస్తూ ముందుకి నడిపించారు. అయితే హౌస్ లో అనూహ్యంగా నెటిజన్స్ ఊహించిన వారు కాకుండా బలమైన కంటిస్టెంట్ లు బయటకి వెళ్లిపోయారు. దీంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ గా ఉందని టాక్ వచ్చింది.
గత వారం ఇనాయాని ఎలిమినేట్ చేయడం కూడా ఎవరికి రుచించలేదు. ఆమె టాప్ 5లో ఒకరిగా ఉంటుందని అందరూ భావించారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇక ఈ సీజన్ తర్వాత నాగార్జున కూడా హోస్ట్ గా తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు మరింత హైప్ క్రియేట్ చేయడానికి కొత్త హోస్ట్ ని తీసుకొని రాబోతున్నారు. అది నందమూరి బాలకృష్ణ సీజన్ 7 బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఆహాలో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా రన్ కావడంతో అతనిని బిగ్ బాస్ హోస్ట్ చేస్తే ఆడియన్స్ నుంచి అదిరిపోయే స్పందన వస్తుందని, అలాగే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని అందించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణని ఒకసారి ట్రై చేసి వర్క్ అవుట్ అయితే అతనిని కంటిన్యూ చేయాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.