పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో పవర్ ఫుల్ రోల్ గా భీమ్లా నాయక్ పాత్ర నిలిచిపోతుంది. మలయాళీ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించడం వలన కలెక్షన్స్ తగ్గాయి కానీ లేదంటే 200 కోట్ల వరకు కలెక్ట్ చేసేది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పే మాట. ఇందులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.
ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో నిర్మాత నాగ వంశీతో బాలయ్య మాట్లాడుతూ భీమ్లా నాయక్ కథ ముందు ఎవరికి చెప్పారు అని అడిగారు. దానికి నిర్మాత మీతోనే చేయాలని అనుకున్నాం. మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని చూడమని కూడా చెప్పాం కదా సార్ అని అన్నాడు. దానికి నేను ఎం చెప్పాను అని బాలయ్య అడగడంతో పవన్ కళ్యాణ్ కి ఈ మూవీ కరెక్ట్ గా సరిపోతుందని చెప్పారు అని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. దీంతో బాలయ్య బాబు సూచనలతోనే భీమ్లా నాయక్ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేశారనే విషయం నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
అయితే బాలకృష్ణకి పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ మీద, అతనికి ఈ సినిమా కంటెంట్ కరెక్ట్ గా సరిపోతుందని జడ్జ్ చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఎలాంటి కల్మషం లేకుండా ఆ సినిమాకి నా కంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని చెప్పిన బాలకృష్ణ ఆలోచన గురించి నందమూరి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పవన్ అభిమానులు కూడా బాలయ్య ఆలోచనలు అర్ధం చేసుకొని గొప్పగా పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇలాంటి మంచి వాతావరణం ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇక త్వరలో పవన్ కళ్యాణ్ కూడా అన్ స్టాపబుల్ షోకి త్రివిక్రమ్ తో కలిసి గెస్ట్ గా వస్తాడని టాక్ వినిపిస్తుంది.