టాలీవుడ్ లో గత కొంత కాలం నుంచి రీ రిలీజ్ సినిమా లు ట్రెండ్ కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ యేటివి . అది కూడా వాళ్ల పుట్టిన రోజు సందర్భంగా.. లేదా ఆ సినిమాల యానివర్సరీల సందర్భంగా విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాలకు అసలు సందర్భం ఏది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే వస్తూనే ఉన్నాయి . గతంలో ఆరేంజ్ లాంటి క్లాసిక్ సినిమా రీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవ్వగా.. రీసెంట్ గా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది.
ఒక డబ్బింగ్ సినిమా కూడా రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయిందంటే.. ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. దీనికి కొనసాగింపు తాజాగా రఘువరన్ బీటెక్ సినిమా కూడా రీ రిలీజ్ అయి థియేటర్లలో కూడా ఆడుతుంది. ఏ సినిమా వచ్చినా ఆడుతుందన్న నమ్మకమో.. అతి పైత్యమో తెలియదు కానీ ఇప్పుడు బాలకృష్ణ నటించిన రెండు పాత కళాఖండాలు రీ రిలీజ్ రెడీ అవుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్కమగాడు ఆ రోజుల్లో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో టెలికాస్ట్ చేయాలంటే కూడా జంకుతున్నారు. బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ లేనన్ని ట్రోల్స్ ఎదుర్కున్న సినిమాగా ఒక్కమగాడు సినిమా కి రికార్డు .
అలాంటి సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నామని కొందరూ బయ్యర్లు ప్రకటించేసారు . ఇదేకాదు.. 2015లో బాలయ్య నటించిన లయన్ మూవీ కూడా రీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించేసారు . రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. రీ రిలీజ్ అయితే ఏదైనా క్లాసిక్ హిట్ సినిమాని చేయాలి కానీ.. బాలయ్యకి ఎందుకు ఉపయోగపడని ఇలాంటి సినిమాలను ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నా ఆ అనౌన్స్ మెంట్ చేసిన బయ్యర్లను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వీటికి బదులు బాలయ్య నటించిన ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.