Bandla counter : విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటించిన చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అంచనాలను మించేసింది. అయితే ఈ ట్రైలర్ సమయంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఓ రేంజ్లో ట్రోల్స్ వస్తున్నాయి. ఒక వైపు రౌడీ హీరో అభిమానులు భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియానూ లైగర్ హ్యాష్‌ట్యాగ్‌తో దుమ్మురేపుతున్నారు. మరోవైపు మాత్రం పలువురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద ట్రోల్స్ గుప్పిస్తున్నారు.
Bandla counter : టాలెంట్ కూడా ఉండాలి.. గుర్తు పెట్టుకో బ్రదర్
తాజాగా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ట్విటర్ వేదికగా విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్’ అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ట్వీట్‌పై భారీగా స్పందిస్తున్న నెటిజన్లు.. విజయ్‌కు బాగా కౌంటర్ ఇచ్చారంటూ కొందరు బండ్లపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మాత్రం ప్రభాస్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌లను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విజయ్‌కు అంత గర్వం పనికి రాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు ఈ రచ్చకు కారణం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ ఈవెంట్‌కు అభిమానులు భారీగా వచ్చారు. ఈ రౌడీ హీరో మాట్లాడుతుంటే.. నినాదాలతో హోరెత్తించారు. విజయ్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈ క్రమంలోనే.. ‘మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయనా..’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయ్ టాలీవుడ్లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడని రచ్చ మొదలైంది. నాటి నుంచి విజయ్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కొదువ లేదు.