Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 7వ వారం మంచి రసవత్తరంగా కొనసాగుతోంది. బిగ్‌బాస్ ఇచ్చిన క్లాస్‌తో కంటెస్టెంట్స్ దారిలోకి వచ్చారు. ఇప్పటి వరకూ కంటెస్టెంట్స్ అంతా బిగ్‌బాస్ పేషెన్స్ని టెస్ట్ చేశారు. ఇక నిన్నటి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. బిగ్‌బాస్ నిన్నటి నుంచి టాస్క్‌ల పేరుతో కంటెస్టెంట్స్ పేషెన్సీని చెక్ చేస్తున్నారు. ఫుడ్ తినడానికి అర్హత సంపాదించుకోవాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే అర్హత సంపాదించుకోవాలి అంటూ టాస్క్‌ల మీద టాస్కులు ఆడించి తను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రేక్షకులకు కావల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి దొంగలను పంపించి ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తెప్పించుకున్నాడు.మొదట ఫుడ్ కట్ చేసి ముప్పు తిప్పలు పెట్టిన బిగ్‌బాస్ ఫుడ్ కోసం, ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడాలని చెప్పాడు.ఇక ఆ టాస్కుల్లో విడతల వారీగా గెలుచుకుని ఫైనల్‌గా అంతా ఫుడ్ తిన్నారు. అంతటితో ఆగాడా? ఈ ఇంట్లో ఉండాలంటే అవసరమైన అర్హతను సంపాదించుకోవాలంటూ ఓ టాస్క్ పెట్టారు.ఇనయ, శ్రీసత్యలను రెండు టీమ్‌లుగా విడదీసి బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఆడించారు. ఇక ఈ టాస్క్‌లో ఇనయ టీమ్ గెలవగా శ్రీసత్య టీమ్ ఓడిపోయింది.
మళ్లీ కంటెస్టెంట్స్ మధ్య బిగ్‌బాస్ నిప్పు పెట్టాడు. ఓడిన టీమ్‌లో నుంచి ఒకరిని తర్వాతి వారానికి నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక మళ్లీ గొడవ స్టార్ట్. కామెడీ ఏంటంటే.. శ్రీసత్య, అర్జున్ ఒకరి పేర్లను మరొకరు సూచించారు. దీనికి గీతూ నిలదీసింది కూడా. మీరు ఆడేది సేఫ్ అనిపిస్తోంది. ఈ నామినేషన్ ఏదో మెయిన్ నామినేషన్స్‌లో వేసుకోవచ్చు కదా.. కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదే అని నిలదీసింది.ఇక ఆ తరువాత మెరీనా, వాసంతి.. గీతూను సూచించారు. రాజ్.. వాసంతి పేరును సూచించాడు. దీంతో అమ్మడికి ఎక్కడ లేనంత కోపం వచ్చింది.’ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు, అయినా సరే తీసుకొచ్చి లీస్ట్‌లో నిలబడితే ఎంత బాధ ఉంటుంది’ అని కన్నీళ్లు పెట్టుకుంది .అయితే చివరకు అంతా కలిసి వాసంతినే నామినేషన్స్‌లోకి నెట్టేశారు.