తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ సంబంధించి ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుందని స్పష్టమైనది. వచ్చే నెల మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 6 అఫీషియల్ గా స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. ఇక తాజాగా ఈ షోకి సంబంధించిన అఫీషియల్ డేట్ ని నిర్వాహకులు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ నాలుగు సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కాబోతుందని తాజా ప్రోమోతో కన్ఫర్మ్ చేశారు. ఆగస్టు చివర వారంలోని ప్రారంభం కావలసి ఉన్న ఏవో కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సోలో పార్టిసిపేట్ చేయబోయే కంటిస్టెంట్లు అందరు కూడా ఫైనలైజ్ అయ్యారని సమాచారం.
మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేయగా అందులో పది మంది అమ్మాయిలు తొమ్మిది మంది అబ్బాయిలు ఉన్నారని తెలుస్తుంది. వీరిలో యాంకర్ ఉదయభాను టిక్ టాక్ స్టార్ గలాట గీతు, యాక్టర్ శ్రీహాన్, చలాకి చంటి జబర్దస్త్ అప్పారావు ఉన్నారని బోగట్ట. అలాగే కొన్ని అన్నోన్ ఫేసులను కూడా బిగ్ బాస్ కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు 15 మందిని ఇంట్లోకి పంపిస్తారని మిగిలిన వారిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపించబోతున్నట్లు టాక్. ఇక పాటిస్పేట్ చేయబోయే వారిలో ఒక యంగ్ హీరోయిన్ కూడా ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా యాంకర్ శివకి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు పోస్ట్ గా రాహుల్ సిప్లిగింజ్, అరియనా గ్లోరీ, శ్రీముఖి, యాంకర్ రవి చేశారు. ఈసారి అవకాశం శివకి లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంట్రవర్షల్ యాంకర్ గా శివకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ బిగ్ బాస్ బజ్ ద్వారా అతనికి మరింత పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎలా ఉండబోతున్నారనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.