బిగ్ బాస్ సీజన్ 6.. ఎవరూ ఔనన్నా.. కాదన్నా.. అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ప్రేక్షకుడు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పెద్దగా ఆడింది లేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 7 మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
అయితే తెలుగు సీజన్ 6 మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సీజన్ 6 నుంచి బయటకు వచ్చిన వారికి కూడా పెద్దగా పేరు రాలేదు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చారంటే.. ఎంతో కొంత క్రేజ్ ఉండేది. కానీ లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ పెద్దగా పేరు సంపాదించలేదు. సరిగా కంటెస్టెంట్లను వాడుకోలేదు. వచ్చినవారు కూడా అంత గొప్పగా ఆకర్శించే ప్రయత్నం చేయలేదు. ఏదో మెుక్కుబడిగా ఆడేశారంతే. ప్రేక్షకుడు కూడా లైట్ తీసుకున్నాడు.
![బిగ్ బాస్ సీజన్ 7 డేట్ ఫిక్స్.. ఈసారి పక్కా ప్లాన్‌తో..! 2 బిగ్ బాస్ సీజన్ 7 డేట్ ఫిక్స్.. ఈసారి పక్కా ప్లాన్‌తో..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/06/23795c59-d9c4-4ab0-b23e-f32d776e5bc6.jpg)
బిగ్ బాస్ సీజన్ 7 డేట్ ఫిక్స్ :
దీంతో సీజన్ 7పై పెద్దగా అప్డేట్ లేదు. తాజాగా ఈ విషయంపై కొంచెం క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 మీద నిర్వాహకులు ఫోకస్ చేశారు. ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సీజన్ ఎలాగైనా దూసుకెళ్లాలని, టీఆర్పీలు గట్టిగా తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని అనుకుంటున్నారట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ నెలలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కానుంది.
బిగ్ బాస్ షోకు సెప్టెంబర్ నెల కాస్త కలిసి వచ్చింది. సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసినవి మంచి హిట్ సాధించాయి. దీంతో సెప్టెంబర్ నెలలోనే బిగ్ బాస్ సీజన్ 7 మెుదలుపెట్టాలని చూస్తున్నారని సమాచారం. ఈసారి ఎలాగైనా.. షోకు టీర్పీలు తీసుకురావాలని భారీగా ప్లాన్ చేస్తున్నారట.
సెప్టెంబర్ 2 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ అది మిస్ అయింతే.. సెప్టెంబర్ 9 ఆదివారం నాడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఓటీటీ(OTT)లోకి తీసుకొచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని నిర్వాహకులు చూస్తున్నారు. నిజానికి సీజన్ 6 విన్నర్ ఎవరంటే.. ఎవరికీ పెద్దగా తెలియదు. ఓటింగ్ చూసుకుంటే.. శ్రీహాన్ విన్నర్.. కానీ డబ్బుకు ఆశపడి చివరిలో తప్పుకొన్నాడు.. దీంతో రేసులో ఉన్న రేవంత్ ని విన్నర్ గా ప్రకటించారు. ఎలాగోలా సీజన్ 6 ముగించేశారు.