కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ బింబిసార. హిస్టారికల్ ఎలిమెంట్ తీసుకొని దానిని ప్రెజెంట్ ని టచ్ చేస్తూ సోషియో ఫాంటసీ చిత్రంగా దీనిని దర్శకుడు మల్లిడి వశిస్ట మలిచిన తీరు ఆధ్యాంతం అందరిని ఆకట్టుకుంది. మొదటి సినిమా అయినా కూడా ఎలాంటి తడబాటు లేకుండా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా సినిమాని ఆవిష్కరించి మొదటి చిత్రంతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు పూర్తయ్యింది.
కళ్యాణ్ రామ్ యాక్టింగ్, బింబిసారా కంటెంట్ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్ళాయి. దీంతో ఇప్పటికి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్స్ తో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు సినిమా ౩౦ కోట్ల షేర్ ని రాబట్టి నట్లు తెలుస్తుంది లాగే గ్రాస్ పరంగా చూసుకుంటే 50 కోట్ల మార్క్ ని దాటిపోయింది. ఇప్పటికే సినిమా సూపర్ హిట్ కారణంగా పెట్టుబడితో రాబట్టడంతో పాటు లాభాల బాటలోకి వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్ లో సినిమా ౩౦ కోట్ల వరకు లాభాలు వస్తాయని తెలుస్తుంది.
కళ్యాణ్ రామ్ బ్యానర్ లో జై లవకుశ తర్వాత రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా బింబిసారా నిలవబోతుంది. ఇక దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో వెంటనే ఉంటుందా లేక గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తారా అనేది చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ డెవిల్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కబోతుంది. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి కారణం పీరియాడికల్ ఎలిమెంట్ తోనే ఆ సినిమాని కూడా తెరకెక్కించడమే.