Biryani : బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి . పండగైనా, పార్టీ అయినా, ఫ్రెండ్స్ మీట్ అయిన సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా ఒక బిర్యానీ కడుపులో పడకుంటే మనసు కుదుటపడదు అంతే. ఈ మధ్యన ఆన్లైన్ లో ఫుడ్ ప్రత్యక్షమవుతుండటతో బిర్యానీల ఆర్డర్ లు మరింతగా పెరిగి పోయాయి . ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసే విషయంలో భారతీయుల అగ్ర ఎంపిక బిర్యానీనే . ఎందుకంటే 2022 సంవత్సరం, అంతకు ముందు సంవత్సరంలోనూ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకం బిర్యానీ . ఇటీవల ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా ఇదే విషయాన్నీ వెల్లడించింది. 2022లో వరుసగా ఏడవ సంవత్సరం ఆర్డర్ చేసిన టాప్ డిష్ చికెన్ బిర్యానీ అని స్విగ్గీ కూడా ధృవీకరించింది. సగటున, నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేయబడుతున్నాయి.

తాజాగా ఒక ముంబై అమ్మాయి ఫుడ్ ఆర్డర్ చేయడానికి తన ఫోన్‌ను తీసుకుని, ఆమె వెంటనే బిర్యానీని ఎంచుకుంది. అయితే తాగిన మత్తులో ఉన్న ఆ అమ్మాయి అనుకోకుండా వేరే రాష్ట్రం నుండి బిర్యానీని ఆర్డర్ చేసింది. తర్వాత ఏం జరిగిందనేది అసలు ట్విస్ట్ గా మారింది.

ముంబైకి చెందిన ఈ అమ్మాయి తాగిన మత్తులో బెంగుళూరులోని మేఘనా ఫుడ్స్ రెస్టారెంట్ నుండి పొరపాటున బిర్యానీని ఆర్డర్ చేసింది. దీని ధర రూ.2500. ఆ తర్వాత తేరుకున్న ఈ అమ్మాయి ఆమె తన ఆర్డర్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసింది. “నేను బెంగుళూరు నుండి రూ.2500 విలువైన బిర్యానీని ఆర్డర్ చేశానా?” @subii అనే వినియోగదారు పేరుతో అమ్మాయి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

జనవరి 21, 2023 న ఈ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తే ఇప్పటికే 487.7 వేల మంది దీనిని వీక్షించారు. ఇక జొమాటో నుండి అనేక వ్యాఖ్యలను పొందింది ఈ పోస్ట్ . “సుబీ, ఆర్డర్ మీ ఇంటి వద్దకు చేరిన తర్వాత మీరు హ్యాంగోవర్‌ని ఆనందిస్తారు అని కామెంట్ చేసింది. మీ అనుభవాణ్ణి మాకు తెలియజేయండి” అని జొమాటో వ్యాఖ్యానించింది.
ఇతర వినియోగదారులు పోస్ట్‌ను చూసి చాలా సంతోషించారు.