మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. మలయాళీ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మెయిన్ స్టోరీ మాత్రమే తీసుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి సినిమాని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలుగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తుంది. ఇక చిరంజీవికి విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో కొణెదల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ పాత్ర అయితే లేదు. కానీ కీలక పాత్రల కోసం స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది. బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఈ సినిమా కోసం రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర కోసం ఈమెని సంప్రదించి దర్శకుడు కథని కూడా నేరేట్ చేయడం జరిగిందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో ఈ వెటరన్ బ్యూటీ కూడా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
కాజోల్ ఇప్పటి వరకు తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమా కానీ చేస్తే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో కూడా కాజోల్ వరుస సినిమాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఆమెని తెలుగుకి పరిచయం చేయడానికి దర్శకుడు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలని లైన్ లో పెట్టి సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడానికి కూడా పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్నారు. ఇక భారీ తారాగణంతో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో హైప్ క్రియేట్ అయ్యి ఉంది.