పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం `బ్రో`. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ మూవీ నుండి టీజర్ రిలీజైంది. ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్న పవన్ తో ఈ టీజర్ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. సాయిదారం తేజ్ కెరీర్ లో మరో హిట్ గా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పడం లో ఎలాంటి అతియోశక్తి లేదు. అంతే కాదు ఈ టీజర్ విడుదల అయినా నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. మంచి రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తుంది.
తాజాగా 10 మిలియన్ వ్యూస్ తో ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసేసింది. దీనితో బ్రో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది అనే చెప్పాలి. ఇక ఈ మూవీ కి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే ని సమకూరుస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండడంతో అప్పుడే టీజర్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తోంది. ఈ సినిమా జులై 28వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది.