పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన మూవీ “బ్రో “. ‘వినోదయ సిత్తం’ ని తమిళంలో దర్శకత్వం వహించిన పి.సముద్రఖని.. తెలుగులోనూ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం జులై 28, 2023 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్ చూసి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ ను త్వరలో విడుదల చేయనున్నారు .
![సెన్సార్ పూర్తి చేసుకున్న "బ్రో" 2 సెన్సార్ పూర్తి చేసుకున్న "బ్రో"](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-20T133544.637.jpg)
తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. కేతికా శర్మ , ప్రియా ప్రకాష్ వారియర్, లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.టీజీ విశ్వ ప్రసాద్ గారు , జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు . ఈ మూవీ కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీత స్వరాలూ అందించారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.