Chandramukhi: తమిళంలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను భయపెట్టింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతారలు కీలక పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా ఇప్పటికీ ఓ ఐకానిక్ సినిమాగా చెబుతుంటారు. ఈ సినిమాను దర్శకుడు పి.వాసు తీసిన విధానం.. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి తోడు జ్యోతిక యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
చంద్రబముఖిని థియేటర్లలో చూసిన జనాలు.. కొత్తగా ఫీల్ అవగా.. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ త్వరలోనే రానుంది. చంద్రముఖిని తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.
చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించగా.. దాని సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. హారర్ సినిమాలకు పేరున్న రాఘవ లారెన్స్ ఈ సినిమా చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కీలకమైన లేడీ క్యారెక్టర్ కి బాలీవుడ్ కి చెందిన ఓ హీరోయిన్ అని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Chandramukhi:
బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చంద్రముఖి సీక్వెల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గతంలో జ్యోతిక అందరినీ భయపెట్టగా.. సీక్వెల్ లో కంగనా రనౌత్ ఏమేరకు భయపెడుతుందని అందరికీ ఆసక్తిగా మారింది.