Chiranjeevi: గాడ్పాథర్ తరువాత మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాస్‌మహరాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో సినిమాలు వచ్చాయి. అయితే అప్పట్లో రవితేజ స్టార్ కాదు.. కానీ ఇప్పుడు రవితేజ కూడా మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అందుకే ఇప్పుడు వీరిద్దరి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
చిరుతో స్టెప్పులేయనున్న రవితేజ:
మొన్నటివరకూ రవితేజ పాత్ర చిన్నగా ఉంటుందని, అది గెస్ట్‌రోల్ అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రవితేజ దాదాపు సగభాగం కనిపిస్టాదట. ఆయన పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందట. ఆయన ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి మరో న్యూస్ కూడా వైరలవుతోంది. ఈ సినిమాలో మంచి మాస్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి, మాస్‌మహరాజ్ రవితేజ కలిపి స్టెప్పులేయనున్నారంట. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ ఆధ్వర్యంలో వీరిద్దరి కోసం ఓ మంచి మాస్సాంగ్ కంపోజింగ్ జరిగిపోయిందంట.
ప్రస్తుతం రవితేజ నటించిన థమాఖా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఆయన అభిమానులు చిరంజీవి, రవితేజ కాంబినేషన్ సినిమా కోసం కూడా ఎదురుచూస్తున్నారు. వాల్తేర్ వీరయ్య వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
Chiranjeevi:
దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాబీ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా చాలా నమ్మకం ఉంది.