మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చినా సరే అవన్నింటిని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ఆయనకు అనేక రకాలుగా సర్ది చెప్పిన సరే ఆయన రాజకీయాలలోకి రావడానికి ఒప్పుకోలేదు. అయితే చాలాకాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నారు .. అన్న ఆలోచనను కలిగిస్తోంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు.
రాజకీయం అనే పద్మవ్యూహంలో అభిమన్యుడు లాగా ఒంటరి పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి మద్దతుగా నిలబడితే బాగుంటుంది అని జన సైనికులు కోరుకుంటున్నా సరే మౌనం వీడని చిరంజీవి.. ఇప్పుడు పవన్ పై జరుగుతున్న ప్రతి విషయానికి తీవ్ర మనస్థాపానికి చెందినట్లు తెలుస్తోంది. అందుకే తమ్ముడిని అలా ఒంటరిగా వదిలేయలేక తమ్ముడి కోసం అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ సమాచారం. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో ఆంధ్ర మంత్రులను ఆయన టార్గెట్ చేశారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఒకరకంగా ఇప్పుడు జనసేనకు ఇది శుభ సూచకం అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి . ఇదే కనుక జరిగితే చిరంజీవి కోసం పెద్ద వాళ్ళందరూ జనసేనకు మద్దతుగా రంగంలోకి దిగుతారని, అప్పుడు పవన్ కళ్యాణ్ కు మరింత సులభతరం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి చిరంజీవిగా అండగా నిలిచి తమ్ముడిని ఏ విధంగా రాజకీయాలలో సక్సెస్ చేస్తారో చూడాలి.