Chiru 154 : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన చిత్రాలకు సంబంధించిన సీక్రెట్స్‌ను ఏదో ఒక సందర్భంలో తనే లీక్ చేసే చిరు.. ఈ సినిమా టైటిల్‌ను కూడా ఇటీవల లీక్ చేశారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ టైటిల్‌ను ఖాయం చేయబోతున్నట్టు వెల్లడించారు. బాబీ దర్శకత్వం ఈ చిత్రం తెరకెక్కనుంది. Mega 154 గా పిలుచుకుంటున్న ఈ సినిమా వాల్తేరు సముద్రతీరం నేపథ్యంలో పక్కా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడు.
Chiru 154 : ఇద్దరి మధ్య ఇగో క్లాష్
తాజాగా మన మాస్ మహారాజా సినిమా సెట్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అతడు సెట్స్‌లోకి జాయిన్ అవడాన్ని ఒక వీడియోతో చెప్పడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో రవితేజ ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అయితే రవితేజ పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. చిరుతో కలిసి రవితేజ ‘అన్నయ్య’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో కూడా రవితేజ.. చిరుకి తమ్ముడిగానే నటిస్తున్నాడని టాక్. అయితే వీరిద్దరూ సవతి సోదరులట. ఈ ఇద్దరి మధ్య ఇగో క్లాషే చిత్రంలోని ప్రధాన కథాంశమని తెలుస్తోంది. ఇలాంటి కథతో కూడిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి కానీ ఈ సినిమా వాటన్నింటికీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ పక్కా మాస్ యాక్షన్ మూవీ. చిరుకి, రవితేజకు మధ్య పోట్లాట అంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం ఇప్పటికే అభిమానుల్లో ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇలా ఒక హీరో సినిమాలో కీలక పాత్ర పోషించడం రవితేజ ఈ మధ్యకాలంలో చేసింది లేదు. వేరే హీరో అయితే రవితేజ కూడా నో చెప్పావాడేమో కానీ తన అభిమాన హీరో చిరంజీవి అవడంతో ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నాడు. మొత్తానికి చిరు, రవితేజ పోట్లాట ఎలా ఉంటుందో చూడాలి.