చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తర్వాత సరికొత్త పాత్రలు ఎంచుకొని సినిమాలు చేయడంలో అతని తర్వాత ఎవరూ లేరనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసేసి కేవలం తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపించే విధంగా తన నటనతో మెస్మరైజ్ చేయడం విక్రమ్ సొంతం. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకి దూరంగా ఎప్పటికప్పుడు సరికొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకి విక్రమ్ వస్తూ ఉంటాడు. ఈ కారణంగానే అతని సినిమాలు ఫ్లాప్, హిట్ లతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూ ఉంటాయి. కొత్తగా సినిమాని ఆవిష్కరించాలని అనుకునే దర్శకులు ముందుగా విక్రమ్ తో చేయడానికి ఇష్టపడతారు.
అలాగే నిర్మాతలు కూడా విక్రమ్ తో సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎన్ని కోట్లు అయిన ఖర్చు చేస్తారు. తాజాగా చియాన్ విక్రమ్ నుంచి రాబోతున్న మరో ఇంటరెస్టింగ్ మూవీ కోబ్రా. ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ట్రైలర్ గానే దర్శకుడు తాను సినిమాలో విక్రమ్ ని ఎలా ఆవిష్కరించబోతున్న అనేది క్లారిటీ ఇచ్చేశాడు. ఒక లెక్కల మాష్టారు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎవరో చంపేస్తే దానిపై తాను ఏ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు అనే చిన్న పాయింట్ ని పట్టుకొని దానికి ఇంటర్నేషనల్ మాఫియాతో కనెక్ట్ చేసి కథని చెప్పేప్రయత్నం చేశాడు.
ఇక స్కాట్లాండ్ పోలీసులకి, విక్రమ్ కి సంబంధం ఏంటి అనేది ఎక్కడ రివీల్ కాకుండా చూపించాడు. ఇక ట్రైలర్ ఆధ్యాంతం విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ ని రిప్రజెంట్ చేశాడు. దానికి తగ్గట్లుగానే యాక్షన్ఎలిమెంట్స్ కూడా ఉండటం విశేషం. ఇందులో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అతని పాత్ర పాజిటివ్ రోల్ గానే ఉంది. విక్రమ్ ని పట్టుకునే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ పఠాన్ కనిపించాడు. ఇలా అన్ని అంశాల మేళవింపుతో ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక ట్రైలర్ చూస్తున్న అందరూ విక్రమ్ వేసిన 15 గెటప్స్ గురించి కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.