ప్రభాస్, కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్‘ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది.దింతో ప్రభాస్ అభిమానులు నెక్స్ట్ రాబోయే సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సలార్’ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
సలార్ టీజర్ ను ఈ నెల 6 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు . జులై ఆరో తేదీన ఉదయం 5.12 గంటలకు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూబ్యూట్ చానెల్లో https://www.youtube.com/@HombaleFilms/videos టీజర్ రిలీజ్ కానుంది అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![మూడు వేల కోట్ల బొమ్మ "సలార్" టీజర్ రిలీజ్కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. 2 మూడు వేల కోట్ల బొమ్మ "సలార్" టీజర్ రిలీజ్కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్..](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/1d3c6bad-3fb4-4810-a78a-1d69b59f913a.jpg)
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కీలక పాత్రలపై పూర్తయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, హిందీతో పాటు వివిధ భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రభాస్ ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంసి. ప్రభాస్ క్రేజ్, రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. . ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ తన మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.