విజయ్ దేవరకొండ– సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఎక్కువ ఫిదా చేస్తున్నాయి . ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది ‘ఖుషి’ టీమ్.
![‘ఖుషి’ సినిమా ట్రైలర్ రిలీజ్కు డేట్ ఫిక్స్ 2 ‘ఖుషి’ సినిమా ట్రైలర్ రిలీజ్కు డేట్ ఫిక్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-08T105657.129.jpg)
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ను ప్రకటించింది ఖుషి టీమ్. ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు తెలిపింది. భిన్న నేపథ్యాలు కలిగిన ఓ జంట ప్రేమకథతో రూపొందిన సినిమా ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా సెప్టెంబరు 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కు సిద్ధమైంది . ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. జి.మురళి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.