రజనీకాంత్ తన కూతురి కోసమే :
రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా మంచి హిట్ అయింది. రజనీకాంత్ కి మూవీ మంచి పేరు ను తీసుకు వచ్చింది అభిమానుల అంచనాలకు మించి ఈ మూవీ ఉంది. ఈ సినిమాకి పోటీగా భోళా శంకర్ సినిమా వచ్చినా అది అట్టర్ ప్లాప్ అయిపోయింది కానీ రజనీకాంత్ మాత్రం భారీ హీట్ ని ఈ మూవీ తో కొట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా 550 కోట్లకు మించి కలెక్షన్లు ని రాబట్టింది ఈ సినిమాను చూసిన వాళ్ళందరూ కూడా ప్రశంసలని కురిపిస్తున్నారు. జైలర్ లో ఈ సీన్ ని మీరు గమనించారా..? రజనీకాంత్ తన కూతుర్ని ఉద్దేశించి అన్నాడని సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు తెగ షికార్లు కొడుతోంది.
![రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..? 2 రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T122742.156.jpg)
అసలు ఏమైందనే విషయానికే వచ్చేస్తే జైలర్ మూవీ లో సన్నివేశాలపై స్టార్ డైరెక్టర్ ప్రవీణ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో చాలా సన్నివేశాలు రజనీకాంత్ జీవితంతో పోలి ఉంటాయని చెప్పారు. చివర్లో చూసినట్లయితే తన కొడుకుతో మాట్లాడేటప్పుడు ఏమైనా చెప్పాలని ఉందా అని అడిగితే రజినీకాంత్ చెప్పిన డైలాగ్ తన కూతురు ఐశ్వర్య ని ఉద్దేశించి ఉన్నట్లు తెలుస్తోదని అన్నారు . రజనీకాంత్ మూవీ లో సక్సెస్ అయినా కూడా నిజజీవితంలో తన కూతుర్ల విషయంలో ఫెయిల్ అయిపోయారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకున్న విషయం మనకి తెలిసిందే.
చిన్న కూతురు సౌందర్య విషయానికి వస్తే ఆమె మొదట్లో ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఐశ్వర్య కి రజినీకాంత్ నచ్చచెప్పాలని చుసిన ఆమె వినకుండా విడాకులు తీసుకున్నారు. ఎన్నోసార్లు రజనీకాంత్ ఈ విషయంపై కుమిలిపోయారంట . అందుకే ఈ మూవీ లో ఈ డైలాగు ఉన్నట్లు తెలుస్తోంది. నిజ జీవితాన్ని ఉద్దేశించి ప్రవీణ్ గాంధీ మూవీ లో ఇలా పెట్టినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూతుళ్ళ విషయంలో ఇంతలా బాధపడుతున్నారా అని వాళ్ళ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.