హీరోగా అల్లు అర్జున్
టాలీవుడ్ అగ్ర హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి నుంచి పుష్ప వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు . డిఫరెంట్ స్టైల్ లో యాక్టింగ్ చేసే హీరో లలో ఒకరు అల్లు అర్జున్. ఆయన యాక్టింగ్ ని మెచ్చి పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలుసు . అలాంటి అల్లు అర్జున్ గంగోత్రి మూవీ ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అల్లు అర్జున్ ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట . అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
అల్లు అర్జున్ తో సినిమా కోసం ఒక ప్రముఖ బ్యానర్ లో ఆఫర్ వచ్చిందని, కానీ వారు నన్ను చూసి బాలేనని ఆ మూవీ నుంచి తప్పించారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట అల్లు అర్జున్. ఆ సమయంలో నాన్న మరియు చిరంజీవి మామయ్య చాలా బాధపడ్డారని, ఇదే సమయంలో వాళ్లు ఆలోచన చేసి సొంతంగా మూవీ చేయాలని ప్లాన్ చేశారు. ఇదే సమయంలో గంగోత్రి మూవీ ప్రపోజల్ వచ్చిందని.. ఈ మూవీ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ.. నటుడిగా తాను ఫెయిల్ అయ్యానని చెప్పారంట . ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ నా ఫేస్ ను మెచ్చలేదని, నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో నాన్న కూడా సినిమాలు తీయలేని పరిస్థితిలో ఉన్నారు.
నన్ను నటనపరంగా నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. కానీ ఇదే సమయంలో దిల్ రాజ్ కొత్త వాళ్లతో ఆర్య సినిమా తీస్తున్నానని చెప్పడంతో అందులో ఆఫర్ వచ్చిందని ఎలాగోలా ఆ మూవీ పూర్తి చేశానని.. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా బన్నీ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంట ప్రస్తుతం భారతీయ మూవీ ఇండస్ట్రీలోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డు తీసుకోవడం ఆయనకు ఆనందం కలిగించిందని ఆ ఇంటర్వ్యూలో తెలియచేసారు .