రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చింది
రష్మిక మందన్న పెద్ద హీరోయిన్ అయిపోయింది. రష్మిక ఇండస్ట్రీకి వచ్చి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకోవడంతో పాటుగా నేషనల్ క్రష్ గా కూడా ఈమె పేరు ను తెచ్చుకుంది. కిరాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చింది రష్మిక. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ కూడా మంచి పొజిషన్లో ఉండలేరంట . ఏదో ఒక ఇబ్బంది రావడం మధ్యలోనే అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి కానీ రష్మిక మాత్రం వచ్చిన అవకాశాలని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ మంచి పేరు ని దక్కించుకుంది .
![ఆ హీరో వల్లే… రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిందని.. మీకు తెలుసా..? 2 ఆ హీరో వల్లే… రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిందని.. మీకు తెలుసా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-28T104408.186.jpg)
సాధారణంగా ఇండస్ట్రీకి రావాలంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉంటే ఈజీగా వచ్చేస్తుంటారు లేదంటే ఎవరైనా దర్శకుడు లేదంటే ఎవరైనా హీరో, హీరోయిన్ పరిచయం చేస్తూ నే ఉంటారు. రష్మిక ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చిందో మీకు తెలుసా..? ఆ హీరో వల్లే రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిందట కానీ చాలామందికి ఈ విషయం తెలియదంట . ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత డిగ్రీ కోసం బెంగళూరుకి వెళ్ళిందంట రష్మిక. అక్కడ ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈమె చేరిందంట .
కాలేజీలో ఒక రోజు ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 2014 బెంగళూరు ని నిర్వహించారట అందులో ఆమె చదువుకుంటున్న టైంలోనే ఒక మేడం ఆమెకు తెలియకుండానే పేరు ఇచ్చేశారు తెలిసింది . అందులో రష్మిక పాల్గొనగా సెమీ ఫైనల్స్ లో సెలెక్ట్ అయ్యి, ఫైనల్స్ కోసం ముంబై వెళ్ళింది ఆ ఫైనల్స్ కి రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ వచ్చారు. ఫ్రెష్ ఫేస్ ఆఫ్ 2014 గా రష్మిక ని ఎంపిక అయింది .
కిరాక్ పార్టీ అనే సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమాలోని బెలకడు అనే పాటలో వెంకటేష్ ఈమెని చూసి ఈ అమ్మాయి హీరోయిన్ గా చాలా బాగుంటుందని చెప్పారట. టాలీవుడ్లోకి తీసుకురావాలని అనుకున్నారు వెంకటేష్. తర్వాత శౌర్య కూడా రష్మిక ని చూసి ఛలో సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు ఇలా వెంకటేష్ గారి వల్లే టాలీవుడ్లోకి వచ్చానని రష్మిక ఓసారి చెప్పారు.