మహేష్ బాబు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా మిస్ అయినా సినిమా :
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన “యమలీల” సినిమా గుర్తుండే ఉండే ఉంటుంది కదా . ఈ సినిమాలో ఇంద్రజ మరియు ఆలీ హీరో హీరోయిన్స్ గా నటించారంట . ఈ సినిమా అప్పట్లోనే బాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో యముడి పాత్రను మరియు ఆల్ రౌండర్ నటుడు కైకాల సత్యనారాయణ పోషించారట . కమెడియన్ గా నటించిన అలీ ఈ సినిమాలో హీరోగా కూడా నటించారు. ఈ సినిమా విడుదల తరువాత ఆయన చాలా ఇతర సినిమాలలో హీరోగా నటించారంట .
![మహేష్ బాబు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా మిస్ అయినా సినిమా ఏదో తెలుసా? 2 మహేష్ బాబు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా మిస్ అయినా సినిమా ఏదో తెలుసా?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-21T181346.856.jpg)
అయితే.. ఈ సినిమా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మొదట హీరో హీరోయిన్స్ గా అలీ, ఇంద్రజ లను అనుకోలేదట. ఈ సినిమాకు మహేష్ బాబు హీరోగా ఉంటె బాగుంటుందని అనుకుంటున్నారంట . అప్పటికి మహేష్ బాబు ఇంకా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ అవ్వలేదు. ఈ విషయమై కృష్ణా రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ వద్ద ప్రస్తావించారంట … మహేష్ ఇంకా చిన్న వాడు. అప్పుడే ఇండస్ట్రీకి తీసుకురాలేను అని సున్నితంగా తిరస్కరించారట. కనీసం మూడేళ్లయినా ఆగాలని అన్నారట. అలాగే.. హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నప్పటికీ ఎందుకనో వాళ్ళకి కుదరలేదు.
అలా, ఈ అవకాశం అలీ, ఇంద్రజలకు వెళ్ళింది. ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఐదు సంవత్సరాల తరువాత మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో మళ్ళి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు ఏ రేంజ్ లో ఉన్నారో మనకి తెలిసిందే. యమలీల సినిమా నాటికి మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి సౌందర్య వయసు 22 సంవత్సరాలు. మహేష్ బాబు కంటే సౌందర్య వయసు 22 సంవత్సరాలు. మహేష్ కంటే సౌందర్య మూడు సంవత్సరాలు పెద్దది. అలా.. మహేష్ బాబు, సౌందర్య జంటగా రావాల్సిన సినిమా మిస్ అయ్యింది అని తెలియచేసారు .