ఒకప్పుడు బాలీవుడ్లో దుమ్ము రేపిన హీరోలు టాలీవుడ్లో కూడా ఏంట్రీ ఇస్తున్నారు. అక్కడ హీరో ఇక్కడ విలన్‌గా నటిస్తున్నారు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ అందిరి హీరోల మాదిరిగా కాకుండా విలనిజంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. అతనే బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలతో ఒక వెలుగు వెలిగించారు . నటన, స్థిరమైన ఫిట్ నెస్.. వ్యక్తిగత జీవితం ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు .
ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ఇటు దక్షిణాద ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు సైఫ్ అలీ ఖాన్ . ఇందులో రావణాసుర పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేశాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరసినిమా లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు . ఇటీవల సైఫ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సైఫ్ వ్యక్తిగత జీవితం.. ఆస్తి వివరాలు నెట్టింట వైరల్ గ మారాయి .