మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి సిమ్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అలానే చిరంజీవి, సిమ్రన్ కూతురు కింద ఐశ్వర్య, అక్షయ పాత్రలో ఒక చిన్నారి నటించి అందర్నీ బాగా మెప్పించింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ చిన్నారి ఉన్న ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా డాడీ సినిమాలో ముద్దు ముద్దు మాటలు తో అందరిని ఆకట్టుకుంది.
తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆమెకి సుమారు 27 సంవత్సరాలు ఉంటాయి. ముంబైలోనే పుట్టి పెరిగింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేస్తోంది. డాడీ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఈమెకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. హీరోయిన్ గా కూడా మళ్లీ అవకాశాలు వచ్చినా ఆమె ఆసక్తి చూపించడం లేదు ఇప్పుడు ఈమె మారిపోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. మరి ఈమె లేటెస్ట్ ఫోటోలని మీరు కూడా చూసేయండి.