మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఈ వార్తల పై అటు నిహారిక కానీ ఇటు చైతన్య కానీ స్పందించలేదు.ఈ వార్తలకి ఊతమిస్తున్నట్టు నిహారిక కూడా మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ లో ఒక్కతే కనిపిస్తుంది.
![నిహారిక భర్త చైతన్య ఎక్కడో ఉన్నాడో తెలుసా? 2 నిహారిక భర్త చైతన్య ఎక్కడో ఉన్నాడో తెలుసా?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-01T185838.894.jpg)
చైతన్య ఎక్కడ కనిపించట్లేదు. దీంతో ఇద్దరూ విడిపోయాఋ అనే నిర్ణయానికి అందరూ వచ్చేసారు. తాజాగా చైతన్య తాను ఎక్కడ ఉన్నది సోషల్ మీడియా ద్వారా వెల్లండించారు. ముంబైలోని గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్ లో తాను ఉన్నట్టు తెలిపాడు.
అక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటానని తెలిపాడు. మనం ఓ ప్లేస్ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి తిరిగొస్తాం అని … ఇది కూడా అలాంటిదేనని చెప్పుకొచ్చాడు. . గత 10 రోజులుగా తాను చేస్తున్న విపాసన ప్రక్రియ ఒక గొప్ప అనుభూతి అని చెప్పాడు.