Bigboss 6 : బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సీజన్లుగా ఈ షోని చూసి తెలుగు ప్రేక్షకులు ఆరో సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక వస్తున్న అప్డేట్స్ సైతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. పెళ్లి అప్పగింతలు కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు సైతం నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.
అసలు నిజానికి ఈ షో ఆగష్టు చివరి వారంలోనే ప్రారంభం కావల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని టాక్. ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా యాంకర్ శివ ఉండనున్నాడని టాక్. కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అసలు కంటెస్టెంట్లలో అత్యధిక పారితోషికం ఎవరు తీసుకోబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ బాస్ ఆరవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో మొదటి పేరు ఉదయభాను.
Bigboss 6 : ఈ సారి 17మందిని ఫైనల్ చేశారట..
సరే.. ఈ లిస్ట్‌లో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరనే విషయాన్ని పక్కనబెడితే.. ఉదయభాను మాత్రం పక్కాగా ఉంటారని సమాచారం. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయభాను. అయితే ఈ షోలో ఆమె పాల్గొంటున్నందుకు అందరి కంటెస్టెంట్స్ కంటే అత్యధిక పారితోషికం ఉదయభానుయే తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సరికొత్త సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో ఈ సారి 17మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్ టీమ్. అందులో భాగంగా 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారట. మిగతా ఇద్దర్నీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తారని టాక్.