జైలర్ సినిమా ఆగష్టు పదవ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయినా విషయం అందరికి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ గా పోషించారు , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంకూడా వహించాడు . రమ్యకృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మరియు జాకీ శ్రాఫ్ లు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది . .
సాధారణంగా స్టార్ హీరోలు ఉన్న సినిమాలలో ఒక విలన్ కి పేరు రావాలి అంటే వాళ్ళు ఏంటో కష్టపడాలి . అయితే.. రజిని కాంత్ లాంటి స్టార్ ఉన్న సినిమాలో నటించిన ఒక విలన్ కి ఇప్పుడు మంచి పేరు వచ్చింది. అయితే దాని వెనుక ఆయన ఎంత కష్టపడ్డారో మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ ఆ విలన్ ఎవరు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సినిమాలో సుత్తితో మొహం పగలగొట్టి చంపేసి.. కళ్ళతోనే ఆడియన్స్ ని కూడా భయపెట్టేసిన దేశవాళీ విలన్ అసలు పేరు వినాయకన్ అని అంటారు ఈ విలన్ తమిళ ఆడియన్స్ కె కాదు తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితుడే అని చెప్పుకోవచ్చు .
![జైలర్ సినిమాలో ఇరగదీసిన ఈ విలన్ ఎవరో తెలుసా? 2 జైలర్ సినిమాలో ఇరగదీసిన ఈ విలన్ ఎవరో తెలుసా?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-16T122539.595.jpg)
ఎక్కడో చూసామే అని అనిపిస్తోంది కదా. అది నిజమే. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన సినిమా “అసాధ్యుడు “ఈ…సినిమా కూడా వినాయకన్ విలన్ గా కూడా నటించారు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడూ, స్వర కర్త, నాట్యాచారుడు కూడా. 1995 లో ‘మాంత్రికం’ లో గెస్ట్ రోల్ తో నటనారంగంలో తన జీవితాన్ని ప్రారంభించారు. మరో రెండు సినిమాల్లో సహాయక పాత్ర, కమెడియన్ రోల్స్ లో కూడా నటించాడు . ఆ తరువాత ‘స్టాప్ వయొలెన్స్’, ‘ఛోటా ముంబాయి’ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి.
ఆయన మొత్తంగా 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక హిందీ సినిమాలో కూడా చాల బాగా నటించాడు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ‘బ్లాక్ మెర్క్యురీ’ అనే డాన్స్ గ్రూపుని కూడా రన్ చేసేవారంట . మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసి లోకల్ గా పాపులర్ అయిన వినాయకన్ స్వయంకృషితో సినిమాల్లో కూడా రాణించారు. ఈయనకు 2016 సంవత్సరంలో ‘కమ్మటి పాదం’ సినిమాలో తన నటనకు కేరళ ప్రభుత్వం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు లభించిందని చెప్పారు.