Earth Quake : టర్కీ, సిరియాను అతి భారీ భూకంపం చిన్నభిన్నం చేసింది. భూకంపం ధాటికి భవనాలు కుప్ప కూలిపోయి శిధిలాల కింద వేల మంది చిక్కుకుని ప్రాణాలను కోల్పోయారు. కొంతమంది అదృష్టవశాత్తు బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాప 100 గంటలకు పైగా కాంక్రీటు కింద చిక్కుకుపోయిన కొంతమందితో సహా, శిధిలమైన భవనాల అవశేషాల నుండి ప్రజలను రెస్క్యూ టీమ్ రక్షించారు.

టర్కిష్ అధికారులు, సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం రెండు దేశాలలో మరణించిన వారి సంఖ్య 24,804 కు చేరింది.2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన సునామీ కారణంగా 18,400 మందికి పైగా మరణించారు. ఈ భారీ భూకంపం ఆ సంఖ్యను అధిగమించింది.

దాదాపు మూడు రోజుల వరకు రెస్క్యూ టీమ్ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసుకు వచ్చే ప్రయత్నాలు కొనసాగించింది.పదివేల మంది ఇంకా కనిపించకుండా పోయారు. ఆ దేశ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, టర్కీలో గాయపడిన వారి సంఖ్య 80,000 కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టర్కీ సైనికులు దోపిడీ, దొంగతనాలకు వ్యతిరేకంగా భూకంపం జోన్‌లోని భాగాలలో పెట్రోలింగ్ ప్రారంభించారు.
ఇక టర్కీ భూకంపం కారణంగా కనిపించకుండా పోయిన భారతీయుడి మృతదేహం హోటల్ శిథిలాల కింద ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.