Eesha Rebba: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు. ఈ అమ్మడు లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత అంతకు ముందు ఆ తరువాత మూవీతో హీరోయిన్ గా మొదటి సక్సెస్ కొట్టింది.
తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ఈ అమ్మడు రెండో సినిమాని అల్లరి నరేష్ తో నటించింది. బందిపోటు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కాలేదు. తరువాత అమీతుమీ అనే మూవీతో మళ్ళీ హిట్ కొట్టింది.
మొదటి మూడు సినిమాలని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలోనే ఈ బ్యూటీ చేయడం విశేషం ఇక చిన్న సినిమాలకి బెస్ట్ ఛాయస్ గా ఈషారెబ్బ హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకుంటూ వచ్చింది. అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన ఆ మూవీ కెరియర్ పరంగా ఈషా రెబ్బకి ఏ విధంగా కూడా హెల్ప్ కాలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోయిన తమిళ్, మలయాళీ భాషలలో మాత్రం వరుస అవకాశాలని ఈ బ్యూటీ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈమె చేతిలో కొన్ని మలయాళీ సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. మరో వైపు ఒటీటీలోకి కూడా అడుగుపెట్టిన ఈషా రెబ్బ 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో మెరిసింది. ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేదు.
ట్రెడిషనల్ కి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించే ఈ అమ్మడు అప్పుడప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఈమె ఫోటోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.