బేబీ సినిమా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూ లో ముచ్చటిస్తూ సినిమా “ఇది నా రియల్ లైఫ్‌లోంచి వచ్చిన కథ .ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది.
కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయ్యిందనేది తెర మీద చక్కగా చిత్రీకరించారు . చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్ సీన్లో ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.మన వంతు ప్రయత్నం మనం చేయ్యా లి. అప్పుడే అవకాశాలు వస్తాయి.
వైష్ణవీ చైతన్య :
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను.తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం.