ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన పెళ్లిపై ప్రభాస్ ఆసక్తికరంగా కామెంట్స్ చేశాడు. మంగళవారం ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తునతి తిరుపతిలో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతోండగా అభిమానులు ఆయన్ని పెళ్లెప్పుడూ అని అడిగారు. అభిమానుల ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా ప్రభాస్ :
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. తన పెళ్లి గురించి ఎన్ని వార్తలో, ఇంకెన్ని పుకార్లో. ఇంతకాలం ప్రభాస్ ఈ విషయమై మౌనంగా ఉన్నాడు. ఎట్టకేలకు తన ఫ్యాన్స్‌కి కాస్త హింట్ ఇచ్చాడు. పెళ్లంటూ చేసుకొంటే – తిరుపతిలోనే చేసుకొంటా అని ప్రకటించాడు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రభాస్ వేదికపై మాట్లాడుతున్నప్పుడు అభిమానులు `పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడూ` అంటూ గోల గోల చేశారు. ఆ అరుపులు ప్రభాస్ చెవిన పడ్డాయి. వాటికి ప్రభాస్ స్పందించాడు కూడా. `పెళ్లా..? పెళ్లి గనుక చేసుకొంటే ఇక్కడే.. ఈ తిరుపతిలోనే చేసుకొంటా` అని అభిమానులకు మాటిచ్చాడు ప్రభాస్. కృతి సనన్‌తో ప్రభాస్ లవ్ లో పడ్డాడని దేశమంతా కోడై కూస్తోంది.