సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి ఇలియానా. ఈ అమ్మడు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది. ఇక ఇక సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఆరంభంలో బాగానే అవకాశాలు వచ్చాయి. అడపాదడపా సినిమాలు చేసింది. అయితే ఓ విదేశీ వ్యక్తితో ప్రేమాయణం ఆమె కొంప ముంచింది. వచ్చిన అవకాశాలని కూడా వదులుకుంటూ అతని ప్రేమలో మునిగితేలుతూ ఉండేది. దీంతో బాలీవుడ్ దర్శకులు కూడా ఇలియానాని పక్కన పెట్టేసారు.
కొంతకాలానికి అతను ఈ బ్యూటీకి హ్యాండ్ ఇచ్చేసాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో శరీరం మీద నియంత్రణ లేకపోవడంతో బాగా లావైపోయింది. చూడటానికి కూడా అందవిహీనంగా తయారైంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గోవాలో సెటిల్ అయ్యింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలియానా బాగా హంగామా చేస్తుంది. బికినీ ఫోటోలని షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది.
అయితే మేకప్ లేకుండా వెట్ శరీరంతో ఉన్న ఫోటోలని ఎంత షేర్ చేస్తున్న చూసేవాళ్ళు బాగానే ఉన్నా కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. నెటిజన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంటే నమ్మబుద్ది కావడం లేదని ఇలియానా లుక్స్ చూస్తున్న వారు అంటున్నారు. మొహంలో ఎలాంటి హాట్ నెస్ కానీ, షైనింగ్ కానీ లేవు. స్మైల్ కూడా చాలా ఫేక్ గా ఉందని విమర్శలు చేస్తున్నారు. ఏజ్ అయిపోయింది అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి మునుపటి అందం లేకపోవడంతో ఇలియానా ఫ్యాన్స్ సైతం ఆమె రూపాన్ని చూసి ఫీల్ అవుతున్నారు.