‘పుష్ప-2’ నుంచి విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీగా విజయాన్ని అందించింది .అది అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో లో చేరిపోయి రికార్డు బద్దలు కొట్టింది ‘పుష్ప-2 సినిమా.
దీంతో ఒక్కసారిగా నార్త్ ఇండియన్స్ కూడా బన్నీకి అభిమానులు అయిపోయారు. ఇక ఆయన తదుపరి సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక అందులో భాగంగానే పుష్ప సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ. అయితే పుష్ప రెండో భాగం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ అధికారి బన్వర్సింగ్ షెకావత్ గా నటించిన ఫాహద్ పసిల్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈరోజు ఫాహద్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో మేకర్స్ విషెస్ చెబుతూ ఈ పోస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఫాహాద్ సిగరెట్ తాగుతూ చాలా భయంకరమైన లుక్ లో కనిపించాడు.