Biggboss 6 : ఈ నెల 4న బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్‌గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడే రెండు రోజులైంది. నిజానికి నిన్న ప్రారంభమైన అనంతరం తొలిరోజు కాబట్టి కంటెస్టెంట్స్ అంతా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కానీ తొలి రోజే మన గలాటా గీతూ తన పేరును సార్ధకం చేసుకుంది. అసలే అమ్మడికి బయట నెగిటివిటీ ఎక్కువ అయినా తగ్గలేదు. తొలిరోజే రచ్చ మొదలు పెట్టేసింది. తన తీరుతో నిన్న గలాటా గీతూ బాగా హైలైట్ అయింది. అందరి మీదా నోరేసుకొని పడిపోయింది. పక్కా లోకల్ సాంగ్‌తో బిగ్‌బాస్ ఇంటి సభ్యులు నిద్రలేచారు. అందరూ మాస్ స్టెప్స్ వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.
ఇక సాంగ్ అవగానే గీతూ గొడవ మొదలు పెట్టింది. బాత్రూమ్లో జుట్టు ఉందంటూ హంగామా మొదలు పెట్టింది. తనకు బాత్ రూమ్ క్లీన్ చేయమని ఇచ్చినా తను జుట్టు మాత్రం క్లీన్ చేయనంటూ గొడవ చేసింది. ముఖ్యంగా ఇనయా సుల్తానాను టార్గెట్ చేసుకుంది. ఆమెను తిక్కదానా, తిక్కమ్మా అంటూ నోరు పారేసుకుంది. ఇనయా కూడా నా తిక్క నాకుందిలే అని సమాధానం చెప్పింది. ఇక హౌస్‌లో మొదటి టాస్కు ఇచ్చారు. ఇంటి సభ్యులు క్లాస్, మాస్, ట్రాష్ అనే వర్గాలుగా విభజించారు. ఇందులో ఎవరు క్లాసు, ఎవరు మాస్, ఎవరు ట్రాష్ అనేది కంటెస్టెంట్సే నిర్ణయించాలి. క్లాస్ సభ్యులు ఏ పనీ చేయనక్కర్లేదు. మాస్ సభ్యులకు ఎలాంటి అధికారం ఉండదు. ట్రాష్ సభ్యులు మాత్రం చినిగిన దుస్తులతో గార్డెన్ లోనే వండుకొని తినాలి.
Biggboss 6 : క్లాస్ టీమ్‌లోకి ఆదిరెడ్డి
ట్రాష్ సభ్యులుగా గీతూ, ఇనయా, రేవంత్ ఎంపికయ్యారు. క్లాస్ సభ్యులుగా శ్రీహాన్, సూర్య, ఆదిత్య ఎంపికయ్యారు. మిగతా వారంతా మాస్. అయితే చిన్న చిన్న పోటీలతో ట్రాష్ సభ్యులు క్లాస్‌లోకి వచ్చే అవకాశమిచ్చారు బిగ్‌బాస్. ఇందులో ఆదిరెడ్డి, ఇనయా పోటీ పడ్డారు. కొబ్బరి బొండాంలో నింపిన రంగునీళ్ళను కాపాడుకోవాలి. ఇందులో ఇనయా ఓడిపోయింది. దీంతో ఆదిరెడ్డి క్లాస్ టీమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆదిరెడ్డితో శ్రీహాన్ స్వాప్ అయి మాస్ టీమ్ లోకి వచ్చాడు. బిగ్‌బాస్ ట్రాష్ సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కును సైతం అంతా బాగానే చేశారు.