‘గాండీవధారి అర్జున’ రిలీజ్ ట్రైలర్
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఈ మెగా హీరోగా ప్రధాన పాత్రల లో నటించిన… ప్రవీణ్ సత్తారు రూపొందించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇందులో వరుణ్‌కు జోడిగా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .
![రాత్రి 7 గంటలకు ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ ట్రైలర్ 2 రాత్రి 7 గంటలకు ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ ట్రైలర్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-21T143229.524.jpg)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాండీవదారి అర్జున’ సినిమా రిలీజ్ ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనా పెంచేసాయి. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.