మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున‘ సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మిస్తున్నారు యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో ‘అర్జున్ వర్మ’ అనే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా సాక్షి వైద్య అలరించనుంది. ‘ఏజెంట్’ తరువాత ఆమె చేసిన సినిమా ఇది.
![భారీ యాక్షన్ దృశ్యాలతో 'గాండీవధారి అర్జున' .. టీజర్ రిలీజ్! 2 భారీ యాక్షన్ దృశ్యాలతో 'గాండీవధారి అర్జున' .. టీజర్ రిలీజ్!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-24T115437.650.jpg)
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. ప్రధానమైన పాత్రలను అర్థమయ్యేలా చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. ఫారెన్ లో చిత్రీకరించిన ఛేజింగ్స్ ఫైట్స్ . .. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి.
యాక్షన్ సినిమాలకు ప్రవీణ్ సత్తారు పేరు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుందనే చెప్పాలి . స్టైలీష్ మేకింగ్ తో ఆయన యాక్షన్ సినిమాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇతర దేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో నిర్మాణ విలువలు కనిపిస్తూ ఉండటం విశేషం.