Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ లో గీతూ రాయల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో కాస్తో కూస్తో కంటెంట్ ఎవరు ఇస్తున్నారంటే వెంటనే గీతూ పేరు చెప్పవచ్చు. ఆదిరెడ్డి, గీతూ కూర్చుని మాట్లాడుకుంటే ఇంకా ఫన్నీగా ఉంటుంది. ఇక బాలాదిత్య, గీతూ కలిస్తే మాత్రం వాదనే వాదన. అసలే ఒకరికి మించిన తెలివితేటలు మరొకరికి ఉన్నాయి. దీంతో చాలా లోతైన సంభాషణే జరుగుతూ ఉంటుంది.
ఇక అసలు గీతూ గేమ్ విషయంలోకి వస్తే… గీతూ ప్రతి వారం బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్ ఆడుతూనే వస్తోంది. టాస్కుల విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక వారం మాత్రమే నామినేట్ అవ్వలేదు. అంటే ప్రతి వారం గేమ్ బాగా ఆడారు అంటే వారికి ఖచ్చితంగా ఎక్కువ నామినేషన్స్ పడతాయని అర్ధం. సో ప్రతి వారం ఎక్కడా తగ్గకుండా గీతూ తన ప్రదర్శన చూపిస్తూ వస్తోంది.
![Bigg Boss 6 Telugu: వామ్మో.. గీతూ సేఫ్ గేమ్ ఆడిన విషయం ఎలా బయట పడిందో తెలుసా..? 2 geethu game](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/geethu-game.jpg)
అయితే, వాసంతి, మెరీన మాత్రం గురువారం ఎపిసోడ్ లో ఆసక్తికర విషయం చెప్తారు. హౌస్ లో నుండి బయటికి పంపేందుకు ఒకరిని ఎంపిక చేయమని బిగ్ బాస్ చెప్పి ఉంటాడు. అప్పుడు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో మెరీనా, వాసంతి ఇద్దరూ గీతూ ఈసారి గేమ్ తక్కువగా ఆడిందని అభిప్రాయపడతారు. దీంతో గీతూ తన గేమ్ స్టార్టజీని బయటికి చెప్తుంది.
నేను గేమ్ ఆడాను. గేమ్ అంటే మీద పడటం, అరుచుకోవడం మాత్రమే కాదు. నేను గేమ్ లో భాగంగా బొమ్మలు, పూలు మన ఆపోజిట్ టీం వాళ్లకి దొరకకుండా ఉండేందుకు నేను ఆదిరెడ్డి, శ్రీహాన్ ను కాసేపు లాగి పట్టుకుని వాళ్ల గేమ్ ముందుకు సాగకుండా మన టీంకు ప్లస్ అయ్యేలా స్టార్టజీతో ఆడాను అని చెప్పుకుంటుంది. ఈ విషయం డిజాస్టర్ పర్సన్ ఎంపిక జరుగుతున్నప్పుడు ఫైమానే ఒప్పుకుంటుంది. గీతూ చాలా స్టార్టజీతో గేమ్ ఆడిందని చెప్తుంది ఫైమా. అలా గీతూ సేఫ్ గా వాళ్ల టీం గెలిచేందుకు ఎలా స్టార్టజీ వాడింది అనేది బయటపడుతుంది.