Ginna: మంచు విష్ణు హీరోగా, సూర్య డైరెక్షన్ లో చేసిన సినిమా ‘జిన్నా’ దసరా సందర్భంగా విడుదలైంది. మంచు విష్ణు హిట్ కొట్టి చాలా కాలమే అయింది. దాంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని మంచు విష్ణు గట్టిగా అనుకున్నా.. సినిమా విడుదల అయ్యాక మాత్రం ఫలితాలు వేరేలా ఉన్నాయి. ఇంతకీ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
మంచు విష్ణు గతంలో చేసిన సినిమాలు కాస్త అటుఇటుగా టాక్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్లు మాత్రం పర్లేదు అనిపించుకునేవి. కానీ రీసెంట్ గా వచ్చిన జిన్నా సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా వెనకపడింది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని సర్ ప్రైజ్ చేస్తుందంటూ మంచు విష్ణు చెప్పగా.. ప్రేక్షకులను ఏమో కానీ మంచు విష్ణుకే షాక్ తగిలినట్లుంది.
తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో థియేటర్లను సొంతం చేసుకున్న జిన్నా సినిమా.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి కేవలం రూ.16లక్షలను కలెక్ట్ చేసుకుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే మంచు విష్ణు పరిస్థితి దారుణంగా మారింది. మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాను అమెరికాలోని 17 లొకేషన్లలో 50కి పైగా షోలు వేస్తే.. 493 డాలర్లు మాత్రమే వచ్చాయి. అంటే కేవలం రూ.40వేలు మాత్రమే అన్నమాట.
Ginna
శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు విడుదల కాగా.. అందులో జిన్నా సినిమా అతి తక్కువ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ.5కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ పెట్టుకుంటే అది ఎంతకీ చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికాలో పదమూడు, పదిహేను టికెట్లు మాత్రమే అమ్ముడుపోవడం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు విష్ణు పనైపోయిందనే సంకేతాలిస్తోంది.