గుడ్న్యూస్.. మేడిన్ హెవెన్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సిరీస్ సీజన్ 2కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జులై 6) కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగేళ్ల కిందట వచ్చిన మేడిన్ హెవెన్ (Made In Heaven) వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్ రెండో సీజన్ కోసం చాలా రోజులుగా ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వాళ్లందరికీ గుడ్ న్యూస్ చెబుతూ త్వరలోనే మేడిన్ హెవెన్ సీజన్ 2 రాబోతున్నట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.
దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. జోయా అక్తర్, రీమా కగ్టి క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో శోభితా దూళిపాళ్లతో పాటు అర్జున్ మాథుర్, కల్కి కొచ్లిన్, జిమ్ సర్బా, శశాంక్ అరోరా, శివానీ రాఘువన్శి నటించారు. వీళ్లంతా ఇప్పుడు రెండో సీజన్ లోనూ కనిపించనున్నారు. ప్రైమ్ వీడియోతోపాటు ఈ క్యాస్ట్ అంతా గురువారం (జులై 6) ఈ రెండో సీజన్ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు.
మేడిన్ హెవెన్ తొలి సీజన్లో ఏం జరిగిందంటే?
పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయన్న దానినే ఆధారంగా చేసుకొని మేకర్స్ ఈ సిరీస్ రూపొందించారు. తొలి సీజన్ అంతా ఆసక్తిగా సాగింది. 2019లో వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెడ్డింగ్ ప్లానర్స్ గా మారిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ల జీవితాల చుట్టూ తిరిగే ఆంథాలజీలాంటి సిరీసే ఈ మేడిన్ హెవెన్. వాళ్లు చేసే పెళ్లిళ్లు, వాళ్ల మధ్య సంబంధాలు, వ్యక్తిగత జీవితాలను తొలి సీజన్ లో చూపించారు.